రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు పూర్తి చేస్తోంది: మంత్రి హరీష్ రావు

-

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పందిళ్ల గ్రామంలో మంగళవారం శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర ట్రస్టు వాసవి నిత్యాన్నదాన సత్రాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ముర్రంశెట్టి రాములు తండ్రి పరితపించే వారని, ఆకలి అయిన వారికి అన్నం పెట్టి మంచి పేరు గడించారు అన్నారు. హుస్నాబాద్ లో రూ. 10 కోట్లతో 50 పడకల మాతాశిశు సంక్షేమ దావఖానను ఏర్పాటు చేస్తామన్నారు.

నియోజకవర్గంలోని అన్ని తండాలకు త్వరలోనే రోడ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకుండా మిల్లులపై రైడింగ్ పేరిట వేధింపులకు గురిచేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్లు కొనుగోలు పూర్తి చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ ఒకవైపు, రేవంత్ రెడ్డి మరోవైపు పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news