ఉప‌స‌ర్పంచ్‌ల చెక్ ప‌వ‌ర్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క మార్గ‌ద‌ర్శ‌కాలు

-

గ్రామ పంచాయ‌తీల్లోఉప స‌ర్పంచ్ ల‌కు ఉండే చెక్ ప‌వ‌ర్ పై రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొన్నిగ్రామ  పంచాయ‌తీల్లో స‌ర్పంచ్, ఉప సర్పంచ్ ల మ‌ధ్య వివాదాలు ఉంటున్నాయి. దీంతో ఉప స‌ర్పంచ్ లు చెక్ ల‌పై సంత‌కం చేయడం లేదు. దీంతో  గ్రామ పంచాయతి సిబ్బందితో పాటు ఇత‌ర అవ‌స‌రాల‌కు నిధులు అందడం లేదు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చెక్ ప‌వ‌ర్ పై రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఉప స‌ర్పంచ్ చెక్ పై సంత‌కాలు పెట్ట‌డానికి ఇబ్బంది పెడితే.. గ్రామ పంచాయ‌తిలోని ఎవ‌రైనా ఒక్క వార్డు మెంబ‌ర్ ను ఎంచుకుని చెక్ పై సంత‌కం చేయ‌డానికి అవ‌కాశం క‌ల్పించింది. దీనికి అవ‌స‌రం అయిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా రాష్ట్ర పంచాయ‌తి రాజ్ అధికారులు విడుద‌ల చేశారు. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం గ్రామ పంచాయ‌తిల్లో చెక్ పై ఉప స‌ర్పంచ్ సంత‌కాలు చేయ‌కుండా.. ప‌దే ప‌దే ఇబ్బంది పెడితే వారి స్థానంలో ఒక వార్డు స‌భ్యుల‌ను ఎంచుకుని.. చెక్ పై సంత‌కాలు పెట్టే అధికారం క‌ల్పించాల‌ని పంచాయ‌తి రాజ్ అధికారులు తెలిపారు. దీని కోసం ఒక గ్రామ స‌భ నిర్వ‌హించాల‌ని సూచించారు.

ఈ గ్రామ స‌భ‌లో వార్డు స‌భ్యుల‌కు అధికారం ఇస్తున్న‌ట్టు తీర్మాణం కూడా  రాయాల‌ని సూచించారు. ఈ తీర్మాణం పై జిల్లా క‌లెక్ట‌ర్ అనుమ‌తి కూడా ఉండాల‌ని తెలిపారు. కాగ ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అన్ని జిల్లాల కలెక్ట‌ర్లుకు జారీ చేసింది. అలాగే ఈ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలను రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయ‌తిల‌కు పంపించాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news