కేక పుట్టిస్తున్న దీపికా పదుకొనే ‘డూబే’ సాంగ్… లిప్ లాక్ లతో రెచ్చిపోయిన దీపిక

-

బాలీవుడ్ అవైటెడ్ మూవీ ‘గెహ్రైయాన్’. దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే, ధైర్య కర్వా నటించిన గెహ్రైయాన్ మూవీ కోసం బాలీవుడ్ తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందు ఫిబ్రవరి 11 రానుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండిండ్ లో ఉంది. దీపికా పదుకొనే, సిద్దాంత్ చతుర్వేదిల మధ్య ఘాటైన రొమాన్స్ సీన్స్ సూపర్ గా ఉన్నాయి.

తాజాాగా ఈ సినిమా నుంచి మొదటి ట్రాక్ ‘డూబె’ను విడుదల చేశారు మేకర్స్. దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది మధ్య రొమాంటిక్ సన్నివేశాలు పీక్స్ లో ఉన్నాయి. 30 సెకన్లు ఉన్న ఈవీడియోను దీపికా పదుకొనే తన ఇన్ స్టాలో షేర్ చేసింది.  ఈ వీడియోలో వీరిద్దరి మధ్య ఘాటైన లిప్ లాక్ కిస్సెస్ ఉన్నాయి. ఈ మూవీలో దీపికా, సిద్ధాంత్ లు అలీషా, జైన్ పాత్రలను పోషిస్తున్నారు. డూబే సాంగ్ ట్రాక్ చూస్తే… సినిమాలో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. పూర్తిగా లవ్, రొమాంటిక్ సినిమా గెహ్రైయాన్ ఉండబోతోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ హాట్ పుట్టిస్తోంది. ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోతున్న జంటగా సిద్దాంత్, దీపిక పదుకునే నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా న్యాచురల్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం విడుదలైన డూబే ట్రాక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కౌసర్ మునీర్ లిరిక్స్ రాయగా… లోతిక ఝా పాడారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news