జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇసుక తవ్వకాలతో ముఖ్యమంత్రి జగన్ బినామీలు రూ.40వేల కోట్లు దోచేశారని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద ఏర్పాటుచేసిన ప్రజాగళం సభ లో పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…..దీనిపై ప్రశ్నించిన జర్నలిస్టును చంపేశారని ఆయన ఆరోపించారు. ‘రాష్ట్రం డ్రగ్స రాజధాని అయిపోయింది. ఇక్కడ 30వేల మందికిపైగా మహిళలు అదృశ్యమయ్యారు అని అన్నారు. దీనిపై ప్రభుత్వం ఒక్కసారీ స్పందించలేదు అని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయింది’ అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన చీఫ్ జోస్యం చెప్పారు. ‘రాష్ట్రంలో రావణ సంహారం జరుగుతుంది. రామరాజ్య స్థాపన జరుగుతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి. బ్లాక్ మనీ పెరిగిపోయింది. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారు. కానీ అదేమీ జరగదు’ అని స్పష్టం చేశారు.