చాలామందికి బొప్పాయి పండ్లు అంటే ఎంతో ఇష్టం. బొప్పాయి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇతర పోషక పదార్ధాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. చాలా సమస్యలు తగ్గించడానికి బొప్పాయి మనకి సహాయపడుతుంది.
హృదయ సంబంధిత సమస్యలు, డయాబెటిస్, క్యాన్సర్, లో బీపీ మొదలైన సమస్యలకు ఈ బొప్పాయి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. బరువుని కూడా కంట్రోల్ చేయడానికి బొప్పాయి బాగా సహాయం చేస్తుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎలా అయితే ప్రయోజనాలు పొందవచ్చో అలానే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కనుక ఈ సమస్యల వాళ్ళు తీసుకోకూడదు.
గర్భిణీలు తీసుకోకూడదు:
గర్భిణీలు బొప్పాయి పండ్లు తినకూడదు. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి కి దూరంగా ఉంటే మంచిది. డాక్టర్ ని కన్సల్ట్ చేసి మాత్రమే మీరు ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.
లో బ్లడ్ షుగర్:
డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి షుగర్ లెవెల్స్ మేనేజ్ చేయడానికి బొప్పాయి సహాయం చేస్తుంది కానీ లో బ్లడ్ షుగర్ వాళ్ళు తినకూడదు. దీనిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ మరింత పడిపోతాయి. దీంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఇర్ రెగ్యులర్ హార్ట్ బీట్:
హృదయానికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్లు కూడా దీనిని తీసుకోకూడదు. ముఖ్యంగా ఇర్ రెగ్యులర్ హార్ట్ బీట్ ఉన్న వాళ్ళు బొప్పాయి కి దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అలెర్జీలు:
ఎవరికైతే లాటెక్స్ అలెర్జీ ఉంటుందో వారు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఇలా బొప్పాయి పండు కి దూరంగా ఉంటే ఏ సమస్యా లేకుండా ఉండొచ్చు. లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.