టెస్టు క్రికెట్ లో రికార్డ్ క్రియేట్ చేశారు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టివెన్ స్మిత్. పాకిస్థాన్ లాహోర్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో ఈ ఘటన సాధించాడు స్మిత్. టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశారు. స్మిత్ 151 టెస్ట్ ఇన్నింగ్స్ లలో 8 వేల పరుగులు పూర్తి చేశాడు.
అంతకుముందు టెస్టుల్లో వేగంగా 8000 పరుగులు చేసి రికార్డ్ శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర పేరిట ఉండేది. సంగక్కర 152 టెస్ట్ ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం స్మిత్ దీన్ని బీట్ చేశాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన ఏడో ఆస్ట్రేలియా బ్యాటర్ గా స్మిత్ నిలిచాడు. సచిన్ టెండుల్కర్ 154 ఇన్సింగ్స్ లో, సోబర్స్ 157 ఇన్నింగ్స్ లలో, ద్రవిడ్ 158 ఇన్నింగ్స్ లో 8000 రన్స్ పూర్తి చేశారు. టెస్టుల్లో స్మిత్ యావరేజ్ కూడ ఇంప్రెసివ్ గానే ఉంది. టెస్ట్ ల్లో స్మిత్ యావరేజ్ 60 ఉండటం విశేషం