ఉపేంద్ర హీరోగా ఆర్జీవీ గ్యాంగ్‌స్టార్ సినిమా.. టైటిల్ ఫిక్స్

-

టాలీవుడ్ విలక్షణ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ త‌న కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ప్ర‌ముఖ క‌న్నడ హీరో ఉపేంద్ర‌తో త‌న సినిమా చేస్తున్నట్టు డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించాడు. త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సినిమా కు ”R” అనే టైటిల్ ను కూడా ఖ‌రారు చేసిన‌ట్టు డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించాడు. కాగ ఈ సినిమా.. భార‌త దేశంలో పేరుగాంచిన ఒక గ్యాంగ్ స్టార్ క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తున్న‌ట్టు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వెల్లడించారు.

కాగ ఈ సినిమాను ఏ స్క్వేర్ ప్రోడ‌క్షన్ అనే నిర్మాణ సంస్థ నిర్మింస్తుంద‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా రామ్ గోపాల్ వ‌ర్మ ఒక వీడియోను కూడా విడుద‌ల చేశాడు. ఈ వీడియోలో హీరో ఉపేంద్ర.. క‌త్తిని ముద్దాడుతు.. న‌వ్వుతూ క‌నిపిస్తాడు. మాస్ లుక్ లో ఉన్న ఉపేంద్ర‌.. గ్యాంగ్ స్టార్ లాగే క‌నిపిస్తున్నాడు. కాగ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మకు గ్యాంగ్ స్టార్ సినిమాలు తీయ‌డం ఇదేం కొత్త కాదు. గ‌తంలో బెజ‌వాడ‌, ర‌క్త చ‌రిత్ర-1, ర‌క్త చ‌రిత్ర-2 తో పాటు ప‌లు గ్యాంగ్ స్టార్ సినిమాల‌ను రామ్ గోపాల్ వ‌ర్మ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news