శ్రీ రెడ్డి.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే . తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోయినా తమిళ్ సినీ ఇండస్ట్రీలో అడపా దడపా అవకాశాలు అందిపుచ్చుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రం అందరిని టార్గెట్ చేస్తూ తనదైన మాటలతో ఎదుటివారి గుండెల్లో హాడలు పుట్టిస్తూ ఉంటుంది. వివాదాల ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి.. హీరోయిన్ కావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. కొంతమంది దర్శక నిర్మాతల చేతుల్లో మోసపోయానని ఫిలిం ఛాంబర్ ముందు అర్ధ నగ్నంగా బైఠాయించి గొడవలు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆమెను మాత్రమే కాదు ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతోమంది అమ్మాయిలను అవకాశాల పేరిట దర్శక నిర్మాతలు వాడుకుంటున్నారని కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి తెరలేపింది.
ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉండడంతో ఈమె సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణకు కూడా గురి అయింది. ఇక అప్పటినుంచి ఈమెకు అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క నటుడిని టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో వారికి చుక్కలు చూపిస్తూ ఈమెతో వారు గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను, చిట్ చాట్ స్క్రీన్ షాట్లను అన్ని షేర్ చేస్తూ ప్రతి ఒక్కరి బాగోతాలు బయటపెడుతోంది.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వయ్యారాలు వొలక పోస్తూ హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతున్న శ్రీరెడ్డి యూట్యూబ్ ద్వారా వంటలు చేస్తూ వంటల కంటే తన హాట్ అందాలన్నీ ఎక్స్పోజ్ చేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది.ఇది ఇలా ఉండగా తాజాగా శ్రీరెడ్డి రాయలసీమ నాటుకోడి పులుసు, రాగిసంకటి వండుతూ తీసినటువంటి ఒక వీడియోని తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసి, తన పెళ్లి గురించి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ వీడియో ద్వారా ఆమె లేటు వయసులో కూడా ఎంతో మంది వివాహాలు చేసుకుంటున్నారని.. కానీ తనకు ఇంకా 18 ఏళ్లు మాత్రమేనని.. ఇంకా కొంచెం లేటుగా వివాహం చేసుకున్నారు పర్వాలేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇప్పటివరకు వచ్చిన సంబంధాలన్నింటినీ తానే స్వయంగా చెడగొట్టానని కూడా తెలిపింది. ఎట్టకేలకు ఏడాది వివాహం చేసుకుంటానని చెప్పిన శ్రీరెడ్డి పై నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు.
అవును నిజమే శ్రీరెడ్డికి ఇంకా పెళ్ళి వయసు రాలేదు నమ్మండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. వామ్మో నవ్విపోదురు నాకేంటి అన్నట్టుంది అమ్మడు యవ్వారం కొందరు అంటే.. సర్లే ఏదో సరదాకి అలా అంది అంటూ లైట్ తీసుకుంటున్నారు మరి కొందరు..