ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ శనివారం రాత్రి కర్ణాటకలోని బళ్ళారి లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమం అనంతరం మంగ్లీని చూడడానికి కొంతమంది యువకులు మేకప్ టెంట్ లోకి దూసుకొచ్చారని.. ఆ తర్వాత ఆమె వెళ్తుండగా కారుపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఘటనపై మంగ్లీ స్పందించారు. దాడి వార్తలను ఆమె ఖండించారు. కన్నడ ప్రజల నుంచి తనకు గొప్ప మద్దతు లభించినట్లు తెలుపుతూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
బళ్లారిలో నాపై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాను. నేను పాల్గొన్న వాటిల్లో ఇదో గొప్ప కార్యక్రమం.. ఫోటోలు.. వీడియోలు చూస్తే మీకే తెలుస్తుంది.ఈ ఈవెంట్ చాలా సక్సెస్ అయ్యింది . కన్నడ ప్రజలు నాకు మద్దతుగా నిలవడంతో పాటు నాపై ఎంతో ప్రేమ చూపించారు. అక్కడి అధికారులు , నిర్వాహకులు కూడా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ విషయాన్ని మాటల్లో చెప్పలేను. ఎవరో కావాలని నా ప్రతిష్ట దెబ్బతీయడానికి ఇదంతా చేస్తున్నారు. నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాను.. అంటూ మంగ్లీ పేర్కొన్నారు.
మంగ్లీ తనపై వచ్చిన వార్తలకు ఈ విధంగా స్పందించి చెక్ పెట్టిందని చెప్పవచ్చు. అయితే ఈమెపై ఎవరు ఇలా కావాలని ఇలాంటి వదంతులు సృష్టించారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఏది ఏమైనా కర్ణాటక ప్రజలు తనకు చాలా సపోర్టు ఇచ్చారని చెప్పి ఆమె మరొకసారి తన అనుభూతిని అందరితో పంచుకుంది.<
View this post on Instagram
/p>