వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టాలని కెసిఆర్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది కేసీఆర్ సర్కార్.
బడ్జెట్ రూపకల్పన పై సీఎం కేసీఆర్ కూడా కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జన రంజకంగా ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించడం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు సీఎం కేసీఆర్. అటు ఖాళీ స్థలం ఉండి, ఇల్లు కట్టుకునే వారికి సీఎం కేసీఆర్ 3 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.