ఎసిడిటీ సమస్యకి ఇలా చెక్ పెట్టేయండి..!

-

ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ ఇంటి చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ చిట్కాలని కనుక అనుసరిస్తే ఎసిడిటికి సమస్యకు చెక్ పెట్టొచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లయితే రెగ్యులర్ గా వాకింగ్ చేయడం లేదా వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటుగా మీరు ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే ఎసిడిటీ సమస్యకి చెక్ పెట్టొచ్చు.

Acidity
Acidity

 

వాము:

చాలా మంది వంటల్లో వాముని ఎక్కువగా ఉపయోగిస్తారు. వాము వల్ల గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు దూరం అయిపోతాయి. రెగ్యులర్ గా మీరు తయారుచేసుకునే వంటల్లో వాముని ఉపయోగించండి.

దీనితో ఈ సమస్యకి మీరు ఈజీగా చెక్ పెట్టొచ్చు. అదే విధంగా జీర్ణ సమస్యలు కూడా దీని వల్ల మాయమైపోతాయి. మీరు కావాలంటే గోరు వెచ్చని నీళ్ళలో కొద్దిగా వాము వేసుకుని ఆ నీళ్లు తాగచ్చు.

జీలకర్ర:

గ్యాస్ట్రిక్ సమస్యను పోగొట్టడానికి జీలకర్ర కూడా ఎంతో మేలు చేస్తుంది. రెండు కప్పుల నీళ్లలో జీలకర్ర వేసుకుని.. దానిని మరిగించి చల్లారిన తర్వాత ఆ నీళ్లు తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు పూర్తిగా మాయమైపోతాయి.

అల్లం:

అల్లం లో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక కప్పు నీళ్లలో అల్లం వేసుకుని మరిగించి ఆ నీళ్లను తాగితే చక్కటి ప్రయోజనాల మీరు పొందవచ్చు.

నల్ల మిరియాలు:

గ్యాస్ట్రిక్ సమస్యని పోగొట్టడానికి నల్ల మిరియాలు కూడా బాగా ఉపయోగపడతాయి. దీన్ని కూడా మీరు రెగ్యులర్ గా తీసుకోవచ్చు. అలానే వెల్లుల్లి, దాల్చిని తో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇలా కేవలం వంటింట్లో ఉండే పదార్థాలతో సులువుగా ఎసిడిటీ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news