ఇంతోటీదానికి అనుమతి, అమరావతి అవసరమా బాబు?

-

ఇతర పార్టీలు, ఇతర రాజకీయ పక్షాల సంగతి కాసేపు పక్కనపెడితే చంద్రబాబు రాజకీయం సగటు రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుచిక్కడం లేదంట. బాబు చేస్తున్న పనుల్లో మీడియాలో వస్తున్నవి, జనం చూస్తున్నవీ, వారికి అర్ధమవుతున్నవే వాస్తవాలా లేక వాటి పరమార్ధం మరొకటి ఉందా అనేది తెలియడం లేదంట. ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈమధ్యనే జరిగిన ఒక సంఘటన. అదేమిటంటే… హైదరాబాద్ టు అమరావతి బాబు ప్రయాణం గురించి.

అవును.. కరోనా కాలంలో సుధీర్ఘ విశ్రాంతి తీసుకున్న చంద్రబాబు అనంతరం ఏపీ డీజీపీ అనుమతితో అమరావతికి ప్రయాణమయ్యారు. ముందుగా విశాఖ వెళ్తానని అనుమతి తీసుకున్నా.. ఆ ఒక్కరోజూ ఫ్లైట్స్ లేకపోయే సరికి విశాఖ వాసులకు ఆ అదృష్టం లేకుండా అయిపోయింది. ఆ సంగతి బాబు హైదరాబాద్ లో ఉండగానే తెల్సినా కూడా అమరావతికి ప్రయాణమయ్యారు. దీంతో ఇక బాబు అమరావతిలోనే, తమకు అందుబాటులోనే ఉంటారని ఏపీ టీడీపీ నేతలు, కార్యకర్తలు భావించారు. కానీ… కార్యకర్త ఒకటి తలిస్తే అధినేత మరొకటి చేశారు. తిరిగి హైదరాబాద్ కు తిరుగుప్రయాణం చేసేశారు.

మ‌హానాడును నిర్వ‌హించ‌డానికే అయితే బాబు ఆ ఆన్ లైన్ కార్యక్రమాన్ని హైద‌రాబాద్ లో ఉండి కూడా నిర్వహించుకోవచ్చు. ఆ మాత్రం దానికే అయితే అనుమతి, అనంతరం అమ‌రావ‌తి అవసరం లేదనేది కార్యకర్తల మాట! ఈ క్రమంలో వీటిని వీకెండ్ పాలిటిక్స్ గా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు! ఒకానొక సమాయంలో వెన్నుపోటు రాజకీయాలు, అనంతరం కూటముల రాజకీయాలు, పొత్తుల రాజకీయాలు చేసిన బాబు… జగన్ పుణ్యమాని ఆన్ లైన్ రాజకీయాలు, తాజాగా వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఇలా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లా శని – ఆది వీకెండ్ అన్నట్లుగా భావించి అమరావతిని వదిలి హైదరాబాద్ కు వెళ్తుంటే… పార్టీ పరిస్థితి మరీ దయణీయంగా మారిపోతుందేమో అని నేతలు తలలు పట్టుకుంటున్నారంట!

Read more RELATED
Recommended to you

Latest news