ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏ స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. కరోనా ఉన్నా సరే ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే చాలా వరకు ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఇక ఇదే క్రమ౦లో ఆయన కొన్ని సంచలన నిర్ణయాలను కూడా తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ బకాయిలను కూడా ఆయన చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల చిన్న మధ్యతరహా సహా సూక్ష్మ కంపెనీలకు సంబంధించిన బకాయిలను, విద్యుత్ చెల్లింపుల తో పాటుగా కాంట్రాక్ట్ సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను, ఫీజు రియంబర్స్మేంట్ బకాయిలను ఏపీ సర్కార్ చాలా వేగంగా క్లియర్ చేస్తూ వెళ్తుంది. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు సిఎం జగన్. తాజాగా జరిగిన ఇళ్ళ పట్టాల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి 3,38,144 గృహాల గత ప్రభుత్వ బకాయిలను క్లియర్ చెయ్యాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు జగన్.
జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8 న ఇళ్ళ పట్టాల పంపిణి కార్యక్రమం మొదలు పెడతారు. ఈ సందర్భంగా ఆయన పేదలకు ఇళ్ళ పట్టాలను పంపిణి చేయనున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం 1,323 కోట్ల రూపాయల గృహ బకాయిలను పేదలకు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.