గతకొన్ని రోజులుగా చంద్రబాబు మాటలు వింటున్న తమ్ముళ్లు, తెలుగు ప్రజలు… “పస లేదు” అని అంటుంటే… ఆ పసలేని మాటలకు దిమ్మతిరిగే కౌంటర్లు వేస్తున్నారు వైకాపా నేతలు! అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండాలని అనడానికి బాబు దగ్గర సరైన లాజిక్ లు లేకుండా పోతున్నాయి. బిల్లులో రాజధాని అని ఉంది కానీ.. రాజధానులు అని లేదనే విషయాన్ని కూడా “పస లేదు” అనేస్తున్నారు! ఈ క్రమంలో వైకాపా నేతలు మేనిపెస్టో మీద లాజిక్ లాగారు!
రాజధాని అనేది కేంద్రం పరిధిలోకి రాదు… అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని కేంద్రంలోని పెద్ద్దలు, బీజేపీ నాయకులు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ డోర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. ఈ సమయంలో రైతుల పేరు చెప్పి ఆపుదామని భావించినా… వారికి న్యాయం చేసితీరతామని జగన్ సర్కార్ చెబుతుంది. దాంతో ఆ స్కెచ్ కూడా వీగిపోయింది. దీంతో 2019 ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన మేనిపెస్టో ని బయటకు తీసింది టీడీపీ!
వైకాపా మేనిపెస్టోలో నవరత్నాల టాపిక్కే ఉంది కానీ… మూడు రాజధానుల గురించిన పాయింట్ లేదని… మేనిపెస్టోలో పెట్టని విషయాన్ని ఎలా అమలుపరుస్తారు అన్నట్లుగా పసలేది వాదనకు తెరతీశారు. ఇప్పటివరకూ జగన్ ఇచ్చిన హామీల్లో 90శాతం నెరవేర్చారు అని చెబుతుండగా.. చెప్పనివి కూడా చేశారని క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో… ప్రజలకు ఉపయోగపడే అంశాల విషయంలో మేనిపెస్టోలో పెట్టనప్పటికీ చేస్తాం అని చెప్పినట్లయ్యింది!
ఈ క్రమంలో మేనిపెస్టోలో చెప్పినవి మాత్రమే చేయాలి తప్ప మరొకటి చేయకూడదు అని బాబు చెబుతున్న మాటలే నిజమైతే… “పసుపు – కుంకుమ” కార్యక్రమం కూడా 2014 టీడీపీ మేనిపెస్టోలో లేదనేది వైకాపా నేతల లాజిక్. ఎన్నికల సమయంలో మూడురోజుల ముందు ఆడపడుచులను ఏమార్చే క్రమంలో.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని.. ఆ అంశం మేనిపెస్టోలో పెట్టలేదు సరికదా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు అమలుపరిచారని లాజిక్ లాగుతున్నారు!
దీంతో… బాబు విమర్శిస్తోన్న మేనిఫెస్టో పాయింట్ లో కూడా “పస లేదు” అనే మాటలు వినిపిస్తున్నాయి! అదే నిజమైతే… అసెంబ్లీని రద్దు చేసి అమరావతిపై మేండేట్ కోరదామనే ఛాలెంజ్ కి అర్ధమే లేదు కదా అనేది విశ్లేషకుల మాట. ఏది ఏమైనా.. అమరావతి విషయంలో బాబు సంపూర్ణ నేరస్థుడు అవుతున్నారనే కామెంట్లకు ఈ సందర్భంగా బలం పెరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు!