జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సూచనలు

-

దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. కరోనా ఉన్నప్పటికీ ఇకపై పరీక్షలను వాయిదా వేయడం కుదరదని, వాయిదా వేస్తే విద్యార్థులు ఒక సంవత్సరం నష్టపోతారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దీంతోపాటు పరీక్షలను వాయిదా వేయాలన్న పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 2 నుంచి పరీక్షలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఇందుకు గాను పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కింద తెలిపిన సూచనలను పాటించాలి.

students who are attending jee exams follow these tips

* జేఈఈ పరీక్షలకు హాజరయ్యే వారు అడ్మిట్‌ కార్డుతోపాటు డిక్లరేషన్‌ ఫామ్‌ను కూడా ఎగ్జామ్‌ సెంటర్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

* ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి.

* పెన్ను, అటెండెన్స్‌ షీటుపై అతికించేందుకు ఓ ఫోటోను తీసుకెళ్లాలి.

* హ్యాండ్‌ శానిటైజర్‌ను తప్పకుండా వెంట తెచ్చుకోవాలి. మాస్కు ధరించాలి.

* ఎగ్జామ్‌ సెంటర్‌లో భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. కనుక ఆ నిబంధనను పాటించాలి.

* పరీక్షా కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు, కాలిక్యులేటర్‌, స్మార్ట్‌ వాచ్‌, బ్లూటూత్‌ వంటి పరికరాలను అనుమతించరు. కనుక వాటిని వెంట తెచ్చుకోరాదు.

Read more RELATED
Recommended to you

Latest news