అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదు : సీఎం రేవంత్ రెడ్డి

-

బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా సాగర్‌ కూడలిలో రూ.148.05కోట్లతో సెకండ్‌ లెవల్‌ వంతెన నిర్మించగా రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో సాగర్‌రింగ్‌రోడ్‌ కూడలలిలో ట్రాఫిక్‌ కష్టాలు పూర్తిగా తీరనున్నాయి అని అన్నారు. బైరామల్‌గూడ జంక్షన్‌లో వంతెనలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి.

వంతెన ప్రారంభంతో సిగ్నల్‌ ఫ్రీగా జంక్షన్‌ మారింది అని తెలిపారు..ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ…వైబ్రెంట్ తెలంగాణ-2050కి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెట్రో విస్తరణకు, అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని, మూసీ అభివృద్ధికి టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ ORRను, శంషాబాద్ విమానాశ్రయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించింది అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news