మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు కసరత్తులను ప్రారంభించాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది అని చంద్ర బాబు నాయుడు వెల్లడించారు.
ఇక ఢిల్లీ టూర్ పై మంత్రి అంబటి బాబు స్పందిస్తూ….ఎంత మంది కలిసి వచ్చినా వైసీపీదే గెలుపు అని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీది అనైతిక పొత్తు అని తీవ్ర విమర్శలు గుప్పించాడు. ప్రస్తుతం పొత్తులో ఉన్న ఈ మూడు పార్టీలకు చెందిన నాయకులు గతంలో ఒకరిపై ఒకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నట్టు ఆయన తెలిపారు.
హోం మినిస్టర్ అమిత్ షాపై రాళ్లు వేయించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.పాచిపోయిన లడ్డూ ఇచ్చారని పవన్ విమర్శించలేదా? అని మండిపడ్డారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు . పొత్తు కోసం బాబు, పవన్.. అమిత్ షా కాళ్లపై పడ్డారు’ అని సంచన ఆరోపణ చేశారు.