బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెజీషియన్ గా, సింగర్ గా , కమెడియన్ గా, హీరోగా ఇలా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇకపోతే జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన సుధీర్ ఆ తర్వాత వచ్చిన గాలోడు సినిమాతో మంచి మాస్ హిట్ అందుకున్నాడు.
జబర్దస్త్ షో కంటే ముందు మ్యాజిక్ షో చేసుకునే సుదీర్ ఆ తర్వాత జబర్దస్త్ షో తో ఒక్కసారిగా టాప్ లోకి వెళ్ళిపోయాడు. ఎప్పటినుంచో నడుస్తున్న టాపిక్ ఏంటంటే సుధీర్ పెళ్లి ఎప్పుడు అని.. జబర్దస్త్ లో ఉన్నప్పుడు రష్మీ ని పెళ్లి చేసుకుంటారని వార్త వచ్చింది. కానీ అది షో వరకు మాత్రమే అని తెలిసిపోయింది. పెళ్లి చేసుకోకపోవడంతో.. ఇంట్లో పేరెంట్స్ పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి తెస్తున్నారట. మొత్తానికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు సుదీర్.
ఇక ఆయన ఎవరిని పెళ్ళి చేసుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సుధీర్ వాళ్ళ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి . కానీ పెళ్లి ఎప్పుడు? ఎక్క ఆమెది ఏ ఊరు? అన్న విషయాలు మాత్రం బయటకు తెలియడం లేదు . మొత్తానికైతే ఈ విషయం నిజం కావాలని సుదీర్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే సుధీర్ ఇప్పుడు సినిమాలలో బిజీగా ఉండడం వల్ల బుల్లితెర షో కి శాశ్వతంగా దూరమయ్యాడు. త్వరలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో దర్శనమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.