చెవి నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి..!

-

కొన్ని కొన్ని సార్లు మనకి చెవిలో నొప్పి వస్తుంది. అయితే ఆ నొప్పి నుండి బయటపడడం కొంచెం కష్టంగా ఉంటుంది. పైగా చెవిలో నొప్పి అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది. ఈ చిట్కాలను అనుసరిస్తే వెంటనే రిలీఫ్ ని పొందొచ్చు అదే విధంగా చెవి నొప్పి నుండి కూడా బయటపడొచ్చు.

 

చెవి నొప్పిని తగ్గించడానికి జామకాయ, కమల, బొప్పాయి పండ్లు తింటే మంచిది. ఇవి చెవి నొప్పిని తగ్గిస్తాయి.
అదే విధంగా మూడు వెల్లుల్లి రెమ్మలు తీసుకుని చితకొట్టి అందులో నువ్వుల నూనె వేసి వేడి చేసి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి చెవులో నాలుగు నుండి ఐదు చుక్కలు వేసుకుంటే తక్షణ రిలీఫ్ పొందొచ్చు.
లేదా రెండు చుక్కల అల్లం రసం చెవిలో వేస్తే వెంటనే రిలీఫ్ ని పొందొచ్చు.
ఉల్లి రసంతో కూడా చెవి నొప్పి తగ్గించుకోవచ్చు. దీనితో ఇన్ఫ్లమేషన్, నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి వాటి నుండి బయట పడచ్చు.
కొద్దిగా ఆలివ్ ఆయిల్ ని వేడి చేసి చెవిలో వేసుకుంటే కూడా తక్షణ రిలీఫ్ పొందొచ్చు.
రెండు చుక్కల తులసి రసాన్ని చెవిలో వేస్తే కూడా వెంటనే రిలీఫ్ వస్తుంది.
ములేతి కూడా చెవి నొప్పి ని పోగొడుతుంది. ములేతిని నేతిలో వేయించి ఆ మిశ్రమాన్ని చెవిలో వేస్తే చక్కగా రిలీఫ్ ని పొందొచ్చు. ఇలా చెవి నొప్పి వచ్చినప్పుడు ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే వెంటనే చెవినొప్పి తగ్గిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news