పాలకూర సాగులో అనువైన నేలలు, మేలైన రకాలు ఇ‌వే..!

-

ఆకుకూరల్లో పాలకూరది ప్రత్యేకమైన స్థానం. శరీరానికి రక్తం పట్టడానికి పాలకూరను ఎక్కువగా తినమని చెప్తుంటారు. ఇందులో ఉండే ఫైబర్, ఖనిజలవణాల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఆకుకూరల్లో పాలకూర ఒకటి..
రైతులు కూడా వీటి సాగును విపరీతంగా చేస్తున్నారు. అయితే ఆకుకూరలను సాధారణ పంటల్లా ఎక్కువ విస్తీర్ణంలో చేయటం వల్ల లాభం ఉండదు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా సాగు చేయటం వల్ల మంచి ఆదాయం పొందవచ్చు.

ఏ రకమైన నేలలు అనుకూలం..?

పాలకూర ఉష్ణ ప్రాంతపు పంట. చలి, కొంతమేరకు మంచును తట్టుకుంటుంది. నీరు నిలిచే భూముల్లో ఈ పంట సాగు చేయకపోవటమే మంచిది. మైదాన కొండ. ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చట. మురుగునీరు పోయే సౌకర్యమున్న అన్ని నేలల్లో పాలకూరను సాగు చేయవచ్చు. ఇసుక నేలలు ఒండ్రు. నేలలు. సాగుకు. అత్యంత అనుకూలం. నీటి వసతిని బట్టి సంవత్సరం మొత్తం సీజన్ తో సంబంధం లేకుండా పాలకూర సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 11కిలోల విత్తనం అవసరమౌతుందట..

సాగుకు అనువైన పాలకూర రకాలు:

పూసా పాలక్‌: ఈ రకం పాలకూర పచ్చని మెత్తని ఆకులనిస్తుంది. విత్తే సమయాన్ని బట్టి ఆరుకోతల వరకు తీసుకోవచ్చు. దిగుబడి ఎకరాకు సుమారు 50 క్విటాళ్లు వస్తుందట.
జాబనర్ గ్రీన్: ఆకుపచ్చని, దళసరి, మెత్తని ఏకరీతి ఆకులు ఈ రకం ప్రత్యేకం. సువాసన వస్తుంది. ఎకరాకు దిగుబడి 108 క్వింటాళ్లకు పైగా వస్తుందని నిపుణులు అంటున్నారు..
పూసా హరిత్ : ఈ రకం చల్లని ప్రాంతాల్లో సాగుకు అత్యంత అనువైనది. వెడల్పాటి ఆకులు కలిగి ఉంటుంది. త్వరగా విత్తనం ఏర్పడదు. అధిక దిగుబడినిచ్చే రకాల్లో ఇది ఒకటి. విత్తిన 20 రోజుల నుండి ప్రతి 15 రోజలుకు ఒకసారి కలుపు నివారణ, అంతరకృషి చేయాలి. విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులివ్వాలి. మూడో రోజు నుండి 7 రోజులకొకసారి నీటి తడులివ్వాలి. నాటిన 5 నుండి 8వారాల త్వరాత ఆకులు కోతకు సిద్ధం అవుతాయి. 3 అంగుళాల ఆకులను కిందనుండి కోయాలి. మొత్తం ఆకులను ఒకేసారి కాకుండా విడతలవారీగా కోవటం బెటర్.
పూసా జ్యోతి: ఈ రకంవి.. వెడల్పైన పచ్చని, మందమైన, మెత్తని ఆకులను కలిగి ఉంటాయి. మొక్కలు వేగంగా పెరుగుతాయి. కోత తర్వాత కూడా త్వరగా పెరుగుతుంది. 6 నుండి 8 కోతలు కోయొచ్చు. ఎకరాకు 120 క్వింటాళ్లకు పైగా ఆకు దిగుబడి వస్తుంది.

పురుగుల నివారణకు..

ప్రధానంగా పాలకూరలో పేను బంక , రసం పీల్చే పురుగుల బెడద ఎక్కవగా ఉంటుంది. ఇవి సోకితే.. ఆకులు ముడుతలు పడి మొక్కలు చనిపోతాయి. పొలంలో వీటిని గుర్తించిన వెంటనే 2గ్రా మలాథియాన్, ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగు మందు పిచికారీ చేసిన వారం రోజుల తర్వాతనే ఆకులు కోయాలని గుర్తుంచుకోండి.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news