మతి మరుపు రాకుండా ఉండాలంటే అవి జాగ్రత్తగా ఉంచుకోవాలి

-

 

 

వయస్సు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో పెరిగే వ్యాధులతో పాటుగా కళ్ళకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కంట్లో శుక్లాలు వస్తే మాత్రం ఆ బాధ భరించలేనిది. సరైన సమయంలో దానికి శస్త్ర చికిత్స జరగకపోతే శాశ్వతంగా చూపును కోల్పోయే ప్రమాదం ఉంది.

ఒక వేళ కంట్లో శుక్లాలతో బాధపడుతున్నారా అయితే వెంటనే శస్త్ర చికిత్స చేయించుకొని సరిచేసుకోవడం మంచిది. దీని వల్ల చూపు మెరుగవ్వడమే గాక తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా వ్యాధి ముప్పు సైతం తగ్గుతుందని పరిశోధనలు తెలిపాయి.ఇందు కోసం శుక్లాలు లేదా నీటి కాసుల్లో ఏదో ఒక సమస్య ఉండి డిమోన్షియా లేని 3 వేల మంది వృద్ధులను 24 ఏళ్ల పాటు పరిశీలించి మరీ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు.
శుక్లాలు శస్త్ర చికిత్స చేయించుకొని వారిలో కన్న చేయించుకున్న వారిలో మతిమరుపు ముప్పు 24 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది.నీటి కాసుల విషయంలో శస్త్ర చికిత్స చేయించుకున్న లేదా చేయించుకోకపోయినా ఎలాంటి తేడా కనిపించలేదు. ఇది కేవలం పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమే. శుక్లాలు తొలిగింపు జ్ఞాపక శక్తి కశ్చితంగా రక్షిస్తుందని ఇందులో రుజువు ఏమి కాలేదు.
చూపు తగ్గడం వంటి జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సమస్యలతో నలుగురితో కలవడం , మెదడుకు ప్రేరణ తగ్గుతాయి. ఇవి డిమెన్షియా దారి తీసే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు ఇప్పటికే పేర్కొంటున్నాయి.
చూపు తగ్గడం వలన పనులు సరిగ్గా చేయలేరు. కాబట్టి శుక్లాలతో చూపు తగ్గినవారు వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స చేయించుకోవడం మంచిదని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news