స్టేట్ బ్యాంక్ లో మీ ఆడపిల్ల కోసం సుకన్య సమృద్ధి స్కీమ్ ని ఇలా ఓపెన్ చెయ్యచ్చు..?

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వాటిలో సుకన్య సమృద్ధి కూడా ఒకటి. ఆడ పిల్లలు వున్న తల్లిదండ్రులు ఈ అకౌంట్‌ను ఓపెన్ చేసేయచ్చు. ఈ స్కీమ్ కోసం మీరు ప్రభుత్వ బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీస్ లో కూడా ఓపెన్ చెయ్యచ్చు.

ఈ స్కీమ్ లో మీరు ప్రతి నెలా డబ్బు డిపాజిట్‌ చేయచ్చు. మెచ్యూరిటీపై ఒకేసారి మొత్తం తీసుకోవచ్చు. పైగా ఈ స్కీమ్‌పై ప్రతీ నెలా వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. ఈ స్కీమ్ ని మీరు స్టేట్ బ్యాంక్ లో కూడా ఓపెన్ చెయ్యచ్చు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఈ స్కీమ్ ని ఎలా ఓపెన్ చెయ్యచ్చు అనేది చూసేద్దాం.

సుకన్య సమృద్ధి యోజన లో ఎంత డబ్బులు పెట్టచ్చు..?

మీరు ఈ స్కీమ్ లో గరిష్టంగా 15 సంవత్సరాలు వరకు పెట్టుబడి పెట్టచ్చు. కనీస మొత్తం రూ. 250 జమ చెయ్యాల్సి వుంది లేదంటే ఖాతా డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు.

సుకన్య సమృద్ధి యోజన లో ఎవరెవరు డబ్బులు పెట్టచ్చు..?

పిల్లలకి 18 ఏళ్లు వచ్చే వరకు సంరక్షకుడు ఖాతాను నడుపుతారు. ఈ ఖాతా లో డబ్బులను ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత తీసుకోవచ్చు. ఈ స్కీమ్ కి 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లలు అర్హులు.

సుకన్య సమృద్ధి యోజన పై ఎంత వడ్డీ వస్తోంది..?

ప్రస్తుతం ఈ స్కీమ్ పైన వడ్డీ రేటు 7.6 శాతం ఉంది. అయితే ఇవి మారుతూ ఉంటాయి.

సుకన్య సమృద్ధి యోజన లో చేరడానికి కావలసిన పత్రాలు ఏవి..?

స్కీమ్ లో చేరాలంటే పథకం ఫారమ్‌, బర్త్ సెర్టిఫికెట్, తల్లిదండ్రుల చిరునామా పత్రం,తల్లిదండ్రుల ఐడీ పత్రం, ఆధార్, ఇతర పత్రాలు అవసరం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news