సౌత్ ఆర్టిస్ట్ లకు చెక్ పెట్టిన సుకుమార్…!

మొత్తానికి ఎలాగైతేనేం… పుష్ప సినిమాకు విలన్ దొరికొనట్లు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ఇంతకాలం
విలన్ గా ఎవరిని పెట్టాలో తెలియక తలలు పట్టుకున్న సుకుమార్,బన్నికి… ఇప్పుడు విలన్ ఇదొరికినట్లుగా తెలుస్తుంది.బన్నీ ఇమేజ్ ను మరింత పెంచేదిగా చేస్తున్న ఈ పాన్ ఇండియా ఫిలింకు త్వరలో వచ్చి జాయిన్ అయ్యే విలన్ మంచి ఎస్సెట్ గా నిలుస్తాడని చెబుతున్నారు.

పుష్ప టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం. బన్నీ,సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ ఫిలింకు ఎప్సటినుంచో విలన్ సమస్య వెంటాడుతుంది.సుకుమార్ ఎంతోమంది ఆర్టిస్ట్ లను విలన్ గా అనుకున్నప్పటికీ.. క్యాస్టింగ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజక్ట్ అయిపోయారు.దీంతో బన్నీ పుష్పకు విలన్ దొరకడం పెద్ద కష్టంగా మారిపోవడంతో… సుకుమార్ తో పాటు అల్లు అరవింద్ కూడా ఫీల్డ్ లోకి దిగారు.అయినా ఫలితం లేకపోయింది.

విలన్ వేటలో విజయ్ సేతుపతి,ఆర్యలతో పాటు అలవైకుంఠపుముంలో చేసిన సముద్రఖనిని కూడా అనుకున్నారు. ఎవ్వరూ లాభం లేకపోవడంతో మాలీవుడ్ ఆర్టిస్ట్ లను ట్రై చేయాలనుకున్నారు.అయితే పుష్పలోని బన్నీ పాత్రను ఢీకొట్టే వాడు కనిపించాలంటే అతను మాసివ్ గా ఉండాలని చూశారు.దానిలో భాగంగా బిటౌన్ ఆర్టిస్ట్ లను వెతికే పనిలొఓ పడ్డారు. పుష్ప ఎలాగు పాన్ ఇండియా ఫిలిం కావడంతో ముంబాయి,చెన్నై,బెంగళూరుకు ఈసినిమాలో కథ లింకై ఉంటుందని తెలుస్తుంది.అందుకే కన్నడ,కోలీవుడ్ నుంచి ఒకరు ,బాలీవుడ్ నుంచి మరొక లీడ్ ఆర్టిస్ట్ ను తీసుకుందామని చూస్తున్నారు.

బిటౌన్ ఆర్టిస్ట్ లలో సోను సూద్ ,నీల్ నితిన్ ముఖేష్ తో పాటు మనోజ్ బాజ్ పాయ్ ,అశుతోష్ రానాలు లైన్లో ఉన్నారు.ఒకవేల వీరు కాదనుకుంటే ఏదో ఒక యంగ్ హీరోతో విలన్ ప్లేస్ రీప్లేస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఓవరాల్ గా పాన్ ఇండియా స్ట్రాటజీలో బ్యాలెన్స్ చేసే బాధ్యతను సుకుమార్ తీసుకున్నాడు.మరి వీరిని చితక్కొట్టి తన హీరోయిజాన్ని బాలీవుడ్ వరకు తీసుకువెల్లాలని బన్నీ చూస్తున్నాడు.