“ఉప్పెన” సినిమా విషయంలో రిలాక్స్డ్ గా ఉన్న సుకుమార్ ..!

-

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఎవరైనా మంచి సక్సస్ లోకి వస్తారు. వీళ్ళకి పెద్ద ఎసెట్ డాన్స్ అండ్ యాక్టింగ్. మెగా హీరోలందరు డాన్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ కారన్న సంగతి తెలిసందే. అంతేకాదు తమ ఫ్యాన్స్ ని మెప్పించడానికి ఎంతైనా శ్రమిస్తారు. ఈ విషయం మెగా హీరోలు చాలా సార్లు చాలా సందర్భాలలో ఓపెన్ గానే చెప్పారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరొక హీరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.

 

ఈ యంగ్ హీరో టాలీవుడ్ కి పరిచయమవుతున్న మొదటి సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జంటగా కృతీ శెట్టి నటిస్తూ టాలీవుడ్ కి పరిచయమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు రెండు లిరికల్ సాంగ్స్ వచ్చి ప్రేక్షకులనుంచి పాజిటివ్ టాక్ ని సంపాదించుకున్నాయి.

ఇక వాస్తవంగా ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని చిత్ర బృందం అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు. కాని లాక్ డౌన్ కారణంగా మళ్ళీ మే ఫస్ట్ వీక్ కి పోస్ట్ పోన్ చేశారు. అయితే లాక్ డౌన్ మరోసారి పొడగించడం తో మళ్ళీ ఈ సినిమాని దసరా సందర్భాంగా రిలీజ్ చేద్దామన్న ఆలోచన చేస్తున్నట్టు తాజా సమాచారం. ఒకవేళ ఆ సమయానికి పెద్ద సినిమాలు ఏవీ లేకపోతే మాత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. లేదంటే డిసెంబర్ కి వాయిదా వేసే ప్లాన్ లో సుకుమార్ బృందం ఉన్నారట. దీన్ని బట్టి సినిమాలో మరికొన్ని మార్పులు చేర్పులు కూడా చేయాలనుకుంటున్నారట. వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా అందులో మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడం తో సుకుమార్ పెద్ద సినిమాల తాకిడి లేకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news