బిగ్‌ బ్రేకింగ్‌ : ఏపీలో ఈ ప్రాంతాల‌న్ని రెడ్ జోన్లే… !

-

క‌లియుగం.. క‌లియుగం అంటాం కానీ, క‌రోనా యుగం ముందు క‌లియుగం ఎంత‌?  ప్ర‌పంచాన్ని హ‌డ‌లెత్తిం చేయ‌డంలా? ఒక‌టా రెండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌న్న‌ర మంది దీప‌పు పురుగుల్లా రాలిపోయారు. క‌రోనాకు బ‌లైపోయారు. మ‌న దేశంలోనూ అంత‌లేదు.. ఇంత‌లేదు.. అని మ‌న నాయ‌కులు స‌న్నాయి నొక్కులు నొ క్కుతున్నా..ప‌రిస్థితి మాత్రం గాడిత‌ప్పుతోంది. ఇప్ప‌టికే ఐదు వంద‌ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్త‌గా నెల రోజులుగా దేశం,రాష్ట్రంలో లాక్‌డౌన్ సంపూర్ణంగా అమ‌ల‌వుతోంది. అయితే, రేప‌టి నుంచి మా త్రం కొంత స‌డలింపు ఇచ్చి.. ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌క‌ల్పించారు.

మ‌న ద‌గ్గ‌ర చూస్తే.. మొత్తం క‌రోనా ఎఫెక్టెడ్ మండ‌లాల్లో త‌ప్ప రాష్ట్ర వ్యాప్తంగా క‌ట్ట‌డి స‌డ‌లించారు. అయితే, ప్ర‌భుత్వం స‌డ‌లించినంత మాత్రాన ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే.. హై ఓల్టేజ్ క‌రెంటు క‌న్నా దారుణంగా క‌రోనా ఎఫెక్ట్ ఉంద‌ని తెలిసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లే ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టు కో వా ల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న‌డంలో సందేహం లేదు. రాష్ట్రంలో మొత్తం 676 మండ‌లాలు ఉన్నాయి. వీటిలో కేవ‌లం 97 మండ‌లాలను మాత్రమే ప్ర‌భుత్వం రెడ్ జోన్‌గా ప్ర‌క‌టించింది. ఇక్క‌డ మాత్ర‌మే క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం క‌ఠిన లాక్‌డౌన్‌ను అనుస‌రిస్తుంది.

క‌ర్నూలు(మొత్తం 17 మండ‌లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి):  క‌ర్నూలు అర్బ‌న్‌, బ‌న‌గాన‌ప‌ల్లె, నంద్యాల‌, పాణ్యం రూర‌ల్‌, ఆత్మ‌కూరు అర్బ‌న్‌, నందికొట్కూరు అర్బ‌న్‌, శిరివెళ్ల‌, కోడుమూరు, చాగ‌ల‌మ‌ర్రి, బేతం చ‌ర్ల‌, గ‌డ‌మెల‌, గూడూరు అర్బ‌న్‌, ఓర్వ‌క‌ల్లు, అవుకు, ఉయ్యాల‌వాడ‌, య‌మ్మిగ‌నూరు అర్బ‌న్‌.

నెల్లూరు(14 మండ‌లాలు రెడ్ జోన్‌):  నెల్లూరు, నాయుడు పేట అర్బ‌న్‌, వాకాడు, త‌డ‌, అల్లూరు, ఇందుకూరుపేట‌,  బ‌లాయ‌ప‌ల్లె, బోగోలు, బుచ్చిర‌డ్డిపాలెం, గూడూరు టౌన్‌, కావ‌లి(అర్బ‌న్‌) కొవ్వూరు, ఓజిలి, తోట‌ప‌ల్లి గూడూరు.

గుంటూరు(12):  గుంటూరు అర్బ‌న్‌, న‌ర‌స‌రావు పేట‌, మాచ‌ర్ల అర్బ‌న్‌, అచ్చంపేట రూర‌ల్‌, మంగ‌ళ‌గిరి అర్బ‌న్‌, పొన్నూరు అర్బ‌న్‌, చేబ్రోలు, దాచేప‌ల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేప‌ల్లి అర్బ‌న్‌

వెస్ట్ గోదావ‌రి(9): ఏలూరు అర్బ‌న్‌, పెనుగొండ రూర‌ల్‌, భీమ‌వ‌రం అర్బ‌న్‌, తాడేప‌ల్లి గూడెం అర్బ‌న్‌, ఆకివీడు, భీమ‌డోలు, ఉండి, కొవ్వూరు అర్బ‌న్, న‌ర‌సాపురం అర్బ‌న్‌.

ప్ర‌కాశం(9): ఒంగోలు అర్బ‌న్‌, చీరాల అర్బ‌న్‌, కారంచేడు, కందుకూరు అర్బ‌న్‌, గుడ్లూరు, క‌నిగిరి అర్బ‌న్‌, కొరిస‌పాడు, మార్కాపురం అర్బ‌న్‌, పొదిలి.

తూర్పు గోదావ‌రి(8) : శ‌ంక‌వ‌రం రూర‌ల్‌, కొత్త‌పేట‌, కాకినాడ రూర‌ల్‌, పిఠాపురం అర్బ‌న్‌,  రాజ‌మండ్రి అర్బ‌న్‌, అడ్డ‌తీగ‌ల‌, పెద్దాపురం అర్బ‌న్‌, రాజ‌మండ్రి రూర‌ల్‌

చిత్తూరు(8): శ‌్రీకాళ‌హ‌స్తి అర్బ‌న్‌, తిరుప‌తి అర్బ‌న్‌, న‌గ‌రి అర్బ‌న్‌, ప‌ల‌మ‌నేరు, రేణిగుంట‌, నిండ్ర‌, వ‌డ‌మాల‌పేట‌, ఏర్పేడు.

క‌డ‌ప‌(7): ప‌్రొద్దుటూరు అర్బ‌న్‌, క‌డ‌ప అర్బ‌న్‌, బ‌ద్వేలు అర్బ‌న్‌, పులివెందుల అర్బ‌న్‌, మైదుకూరు అర్బ‌న్‌, వేంప‌ల్లె, యెర్ర‌గుంట్ల అర్బ‌న్‌,

క్రిష్టా(5):  విజ‌య‌వాడ అర్బ‌న్‌,  పెన‌మ‌లూరు రూర‌ల్‌, జ‌గ్గ‌య్య‌పేట అర్బ‌న్‌, నూజివీడు అర్బ‌న్‌, మ‌చిలీప‌ట్నం అర్బ‌న్‌

అనంత‌పురం(5) :  హిందూపురం అర్బ‌న్‌, అనంత‌పురం అర్బ‌న్‌, క‌ళ్యాణ‌దుర్గం, కొత్త‌చెర్వు, శెట్టూరు.

విశాఖ‌(3):  విశాఖ‌ప‌ట్నం అర్బ‌న్‌, ప‌ద్మ‌నాభం, న‌ర్సీప‌ట్నం అర్బ‌న్‌

Read more RELATED
Recommended to you

Latest news