పిల్లలకి ఆన్ లైన్ క్లాసుళు : సరైన ప్లానింగ్ లేక ఇబ్బందులు ?

-

కరోనా వైరస్ వల్ల దేశంలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. అనుకోని విపత్తు గా ఈ మహమ్మారి కరోనా వైరస్ రావడంతో ప్రజల ప్రాణాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. స్కూలు, కాలేజీలు మూతబడ్డాయి. దీంతో విద్యా సంవత్సరం కి చివరి టైములో డామేజ్ జరుగుతున్న తరుణంలో స్కూల్ యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసుళు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ తరుణంలో యాజమాన్యాలు మరియు పిల్లల మధ్య సరైన అవగాహన మరియు ప్లానింగ్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.Kendriya Vidyalaya to conduct live classes on YouTube, Facebook ...క్లాసులు చెబుతున్న యాజమాన్యం… పిల్లలకి అవి అర్థం అవుతున్నాయో లేదో కూడా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా హోంవర్క్ అని భయంకరంగా వర్క్ ఇవ్వటంతో పిల్లలు ఆన్ లైన్ క్లాసులు విషయంలో సరిగ్గా శ్రద్ధ చూపడం లేదు. కొంతమంది పిల్లల తల్లిదండ్రులకు సరైన అవగాహన టెక్నాలజీపై లేకపోవడంతో… అటువంటి పిల్లలు క్లాసులు మిస్ అవుతున్నారు. మరోపక్క ఈ క్లాసులు జరుగుతున్న తరుణంలో ఉద్యోగం లేక ఉపాధి లేక ఇళ్లలో ఉన్న పిల్లల తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యాలు ఫీజులు అడుగుతున్నాయి.

 

దీంతో చాలా వరకు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాలు ప్రవర్తించిన తీరుపై  మండిపడుతున్నారు. పనులు లేక ఇంట్లో తినటానికి తిండి లేక ఉన్న సమయంలో మిమ్మల్ని ఆన్లైన్ క్లాసులు ఎవరు చెప్పమన్నారు మమ్మల్ని స్కూల్ ఫీజు ఎందుకు అడుగుతున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో కరోనా ఎఫెక్ట్ తో పిల్లలకి ఆన్లైన్ క్లాసుల విషయంలో సరైన ప్లానింగ్ లేక స్కూల్ యాజమాన్యాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news