పిల్లలూ.. వేసవిలో ఆరోగ్యం జాగ్రత్త… ఈ 10 తప్పులు అస్సలు చెయ్యద్దు..!

-

వేసవికాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వడదెబ్బ మొదలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేసవికాలంలో పిల్లల స్కూల్ కి కూడా సెలవులు ఇస్తారు కాబట్టి పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటారు. పైగా ఎండలు వలన ఈ తప్పులు చేయకుండా ఉండడం మంచిది. తల్లిదండ్రులు పిల్లలు తప్పులు చేయకుండా చూసుకోవాలి పిల్లల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా చర్మ సమస్యలు వంటివి కలగకుండా చూసుకోవాలి.

సన్ స్క్రీన్ లోషన్ ని పిల్లలకి అప్లై చేయడం వలన చర్మ సమస్యలు రావు. ఎండ వేడి తగ్గేంత వరకు బయటకి తీసుకు వెళ్ళకండి ఒకవేళ కనుక బయటికి వెళ్లాల్సి వచ్చినా టోపీ ధరించేటట్టు చూసుకోండి. లేదంటే గొడుగు ని తీసుకు వెళ్ళండి. వేసవికాలంలో ఎండలు మండిపోతున్నప్పుడు పిల్లలకి వదులుగా ఉండే దుస్తులు కాటన్ దుస్తులు వేయాలి. దళసరిగా ఉండే వాటిని వద్దు. హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. పిల్లలు ఎక్కువ నీళ్లు తాగేటట్టు పెద్ద వాళ్ళు చూసుకోవాలి. ఏడాదిలోపు ఉండే చిన్నారులు తల్లిపాలు లేదంటే ఫార్ములా ని ఆరారా ఇస్తూ ఉండండి. చిన్నపిల్లల యూరిన్ ని పరిశీలిస్తూ ఉండండి వేడి చేసింది ఏమో గమనించండి.

పిల్లలు తీసుకునే ఆహారం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. జంక్ ఫుడ్ వంటి వాటిని వాళ్లకి అస్సలు ఇవ్వకండి నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు పండ్లు ఇవ్వండి. చాలామంది పిల్లలు బయట ఆడుతూ ఉంటారు ఎండలో పిల్లల్ని బయట ఆడకుండా చూడండి. ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడించండి. వేసవి కాలంలో చర్మ సమస్యలు కీటకాల వలన ప్రమాదం రాకుండా చూసుకోవడం కూడా ముఖ్యం. బాగా ఎక్కువసేపు పిల్లలు ని ఆడనివ్వద్దు. పిల్లలు బాగా ఆడటం వలన డిహైడ్రేషన్ కలగచ్చు నీరసం కూడా రావచ్చు. పిల్లలు యొక్క ఆరోగ్యం గురించి కచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్ వంటి వాటిని పిల్లలకి ఇవ్వకండి వేసవికాలంలో వేడి వలన కురుపులు వంటివి కలుగుతాయి. ఇలాంటివి ఏమీ లేకుండా చల్లగా వాళ్లకి ఉండేటట్టు చూసుకోండి. వేసవికాలంలో అనారోగ్య సమస్యలు కలగకుండా తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి.

Read more RELATED
Recommended to you

Latest news