ఇక నుంచి ఇంటర్‌ ఆంగ్లంలో ప్రాక్టికల్స్‌

-

తెలంగాణ ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌లోభౌతికశాస్త్రం, రసాయన, జీవ, వృక్ష శాస్త్రాలతో పాటు ఒకేషనల్‌(వృత్తి విద్య) కోర్సుల్లోనే ప్రాక్టికల్స్‌ ఉండేవి. ఇక నుంచి ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ కొత్త విద్యాసంవత్సరం (2023-24) నుంచి ఫస్టియర్‌ విద్యార్థులకు వీటిని అమలు చేయాలని ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయిస్తారు. రాత పరీక్ష 80 మార్కులకే పరిమితమవుతుంది.

కొత్త విద్యాసంవత్సరంలో పలు సంస్కరణలు అమలుచేయాలని గత నవంబరులో జరిగిన ఇంటర్‌ బోర్డు పాలకమండలి నిర్ణయించింది. అందులో ఇంగ్లిషులో ప్రాక్టికల్స్‌ అమలు ఒకటి. ఆంగ్లంలో సంభాషించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని, దానివల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రాక్టికల్స్‌కు సిలబస్‌ కూర్పుపై భాషా నిపుణులతో బోర్డు అధికారులు చేసిన కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రయోగ పరీక్షల్లో భాగంగా తరగతి గదిలో విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడిస్తారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాలు చెప్పి.. ఆంగ్లంలో ఎలా మాట్లాడతారో పరీక్షిస్తారు. అందుకు ఆంగ్ల నిపుణులు మాడ్యుళ్లు రూపొందిస్తున్నారు. వాటికి సంబంధించిన పుస్తకాలనూ ముద్రించాలని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news