తెలంగాణలో పాఠశాలలకు నేటితో వేసవి సెలవులు ముగిసిన సంగతి తెలిసిందే. రేపటి నుండి స్కూల్స్ ఉంటాయా? ఉండవా? అని అందరిలోనూ ఆందోళన నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో పాఠశాలల వేసవి సెలవులను పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20 వరకు వేసవి సెలవులను పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. అటు రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు కూడా తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది.
ఎడ్ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 22 వరకు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం… లా- సెట్ దరఖాస్తు గడువు ఈనెల 25 వరకు పొడిగించింది. అలాగే పిఈ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ నెల 20 వరకు లాక్ డౌన్ ఉంది. సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఉన్న సంగతి తెలిసిందే.