పాటలు వింటూ నిద్రపోయే అలవాటు ఉందా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!

-

చాలా మంది రాత్రి నిద్రపోయే సమయం లో పాటలు వింటూ ఉంటారు. స్లీప్ రిసర్చర్ దీని కోసం కొన్ని విషయాలను కనుగొనడం జరిగింది. మరి వాటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్కల్లిన్ యొక్క ఇటీవల చేసిన అధ్యయనం ప్రకారం మ్యూజిక్ వినడం మరియు నిద్ర మధ్య ఉన్న సంబంధాన్ని పరిశోధించింది. అయితే ఇలా వినడం వలన పాట అలా మైండ్ లో రన్ అవుతుంది అని తెలుస్తోంది.

నిద్రపోయే/ sleeping

అయితే సాధారణంగా ఇది నిద్ర పోకుండా వుండే సమయంలో జరుగుతుంది. కానీ నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పాటల మెదడు లో కదులుతూ ఉంటాయి అని దీని ద్వారా తేలింది. మ్యూజిక్ వినడం వల్ల మనసు చాలా హాయిగా ఉంటుంది.

చాలా మంది పిల్లలు పెద్దలు కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు పాటలు వింటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మంచి జరగదు. ఎంత ఎక్కువ సేపు మ్యూజిక్ వింటే అంత ఎక్కువ అది రిపీట్ అవుతూ ఉంటుంది.

దీని కారణంగా నిద్రకి కూడా సమస్య వస్తుంది. లిరికల్ మ్యూజిక్ కంటే కూడా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వలన ఎక్కువ సమస్య వస్తుంది. అయితే ఈ సర్వేలో 209 మందిని తీసుకుని పరిశోధన చేశారు.

బ్రెయిన్ వేవ్, హార్ట్ రేట్, శ్వాస మొదలైన వాటిని నిద్రపోయేటప్పుడు చెక్ చేశారు. నిద్రపోయే ముందు మూడు పాపులర్ సాంగ్స్ ని వాళ్ళకి వినిపించారు. అయితే ఎవరికైతే తిరిగి పాట గుర్తుకు వస్తుందో వాళ్ళకి నిద్రపోవడానికి సమస్య కలిగేది.

రాత్రి నిద్ర పోయేటప్పుడు ఎక్కువగా ఈ సమస్య వస్తుందని సర్వే ద్వారా తేలింది. మామూలుగా చాలా మంది మ్యూజిక్ వల్ల నిద్ర బాగా ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిద్రకు భంగం కలుగుతుందని తెలుసుకోవాలి.

నిద్ర యొక్క నాణ్యత కూడా పాటలు వల్ల తగ్గిపోతూ ఉంటుంది. అదే విధంగా ఈ పాటలు గుర్తుకు రావడం వల్ల టాస్క్ మీద ఫోకస్ చేయడం తో పాటు ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news