అయ్య బాబోయ్.. ఇది ఫిబ్రవరి నెలే. కానీ.. ఎండలు మాత్రం చూడండి… ఎలా మండుతున్నాయో. ఫిబ్రవరిలోనే ఎండలు ఇలా ఉంటే.. ఏప్రిల్, మే మాసంలో ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నిజమాబాద్, రామగుండం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదయింది. మిగితా ప్రాంతాల్లో 37 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదయింది. ఈ నెలలోనే 40 డిగ్రీలకు దగ్గర్లో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రానున్న రోజుల్లో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
ప్రజలు కూడా మండే ఎండలను తట్టుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే వడ దెబ్బ తాకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.