సూర్యనారాయణస్వామిని తాకిన సూర్యకిరణాలు..

ప్రతి ఏటా మార్చి, అక్టోబర్ నెలలో శ్రీకాకుళంలోని అరసవల్లిలో ఉన్న సూర్యనారాయణస్వామి వారిని సూర్యకిరణాలు తాకుతుంటాయి. ఈసారి అక్టోబర్ నెల మొదటి రోజునే సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి. ఇవాళ ఉదయం 6.09కు స్వామి మూలవిరాట్‌కు సూర్యకిరణాలు తాకాయి. రేపు, ఎల్లుండి కూడా సూర్యకిరణాలు స్వామివారిని తాకే అవకాశం ఉంది. ఉత్తరాయణం నుంచి దక్షిణాయణం, దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి మారే సమయంలో సూర్యకిరణాలు స్వామి వారిని తాకడం ఆనవాయితీ.