“సుందరి” ప్రీ లుక్ అదుర్స్..!

తెలుగులో అవును సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువైంది పూర్ణ. తెలుగుతో పాటు అటు తమిళ్, మలయాళం, కన్నడలోనూ తన నటనతో మెప్పించి ప్రతిభను చాటుకుంది పూర్ణ. ప్రస్తుతం టాలీవుడ్లో పూర్ణ న‌టిస్తోన్న కొత్త చిత్రం ‘సుంద‌రి’. క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ మూవీ ప్రీ లుక్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. అంద‌మైన కాళ్ల‌కు బంగారు ప‌ట్టీల‌తో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ ప్రీలుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వ‌స్తోన్న ఈ చిత్రంలో అందాల భామ పూర్ణ లీడ్ రోల్ లో న‌టిస్తోంది.

ప్రీ లుక్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తునారు డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్. ఈ సినిమాను రిజ్వాన్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సుంద‌రి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. పూర్ణ కొత్త చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏఎల్ విజ‌య్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న త‌లైవి చిత్రంలో వీకే శ‌శిక‌ళ పాత్ర‌లో న‌టిస్తోంది పూర్ణ‌. దీంతోపాటు క‌న్న‌డ, మ‌ల‌యాళంలో మరో రెండు చిత్రాలు చేస్తోంది పూర్ణ.