సునీల్ కి జోడీగా యాంకర్ అనసూయ..?

కలర్ ఫోటో సినిమాతొ విలన్ గా మారి అందర్నీ మెప్పించిన సునీల్, మళ్ళీ హీరోగా మారుతున్నాడు. వేదాంతం రాఘవయ్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో సునీల్ హీరోగా కనిపిస్తున్నాడు. దర్శకుడు హరీష్ శంకర్, ఈ సినిమాకి కథ అందిస్తుండడం విశేషం. ఐతే ఈ చిత్ర ప్రారంభోత్సవం నిన్ననే జరిగింది. చంద్రమోహన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఐతే తాజా సమాచారం ప్రకారం వేదాంతం రాఘవయ్య సినిమాలో హీరోయిన్ ఎవరనేది తెలిసిపోయింది.

బుల్లితెర మీద తన గ్లామర్ తో సరికొత్త హొయలు తీసుకువచ్చిన యాంకర్ అనసూయ, సునీల్ పక్కన హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఈ మేరకు చిత్రబృందం అనసూయని సంప్రదించిందని టాక్. అనసూయ తన అంగీకారం తెలపాల్సి ఉందట. ఇదే నిజమైతే తెరపై క్రేజీ కాంబినేషన్ ని చూడబోతున్నాం అన్నమాట. 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.