ఏం చెప్పావో అది నిలబెట్టుకున్నావ్.. గోపీచంద్ కు గురూజీ అభినందనలు !

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన సినిమా రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి మొదటి రోజు కొన్ని ఫైనాన్స్ ఇష్యూల వల్ల మొదటి రెండు షోలు క్యాన్సిల్ అయ్యాయి. అయితే ఫస్ట్ షో నుంచి మొదలైన ఈ సినిమా ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరకంగా రవితేజ గోపీచంద్ ఇద్దరూ కలిసి హ్యాట్రిక్ సాధించారని జనాలు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ సినిమా హిట్ కావడంతో గోపీచంద్ మలినేనిని దర్శకుడు త్రివిక్రమ్ అభినందించారు. మీరు సినిమా ఎలా తీస్తారని నాకు చెప్పారో అలాగే తీశారు అంటూ గోపీచంద్ మలినేనికి ఆయన ఒక వాయిస్ మెసేజ్ పంపినట్లు సమాచారం. సినిమా నాకు చాలా చాలా నచ్చిందన్న ఆయన ఈ సినిమాని థియేటర్ ఫుల్ గా ఉన్నప్పుడు చూస్తే మరింత కిక్ ఇస్తుందని ఆయన పేర్కొన్నాడు. అలానే నటీనటులను పేరుపేరునా ప్రస్తావించిన ఆయన ఈ సినిమా హిట్ అయినందుకు కంగ్రాట్స్ కూడా చెప్పారు.