అదిరిపోయే స్కీమ్… ఇక లాభాలే లాభాలు…!

మీరు ఏదైనా మంచి స్కీమ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారా…? అయ్యితే మీకోసం ఒక మంచి స్కీమ్ ఇక్కడ వుంది. దీనిలో కనుక మీరు జాయిన్ అయితే మంచి లాభాలు మీరు పొందవచ్చు. దీని కోసం మీరు ఎక్కడకి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కూర్చునే ఎన్‌పీఎస్ అకౌంట్ తెరవొచ్చు.

ఈ అకౌంట్ తెరవడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. మంచి రాబడి పొందొచ్చు పైగా పన్ను కూడా ఆదా చెయ్యచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA ఒక గుడ్ న్యూస్ ని చెప్పింది.

ఆన్‌లైన్ ఇకేవైసీ ద్వారా నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS స్కీమ్‌లో జాయిన్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఇచ్చింది. సులభంగానే ఎన్‌పీఎస్ ఖాతా తెరవొచ్చు. ఆధార్ కార్డు నెంబర్ కచ్చితంగా ఉండాలి. దీనిలో మీరు 60 ఏళ్లు వయసు వచ్చే వరకు డబ్బులు కడుతూనే రావాలి. రోజుకు రూ.53 ఆదా చేసి నెల చివరిలో ఎన్‌పీఎస్ ఖాతాలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి.

అంటే మీరు నెలకు రూ.1590 కట్టినట్లు అవుతుంది. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ వస్తే మీకు రూ.కోటికి పైగా వస్తాయి. 18 ఏళ్లు వయసు కలిగిన వారు ఎవరైనాసరే ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులే. కనీసం రూ.500తో కూడా ఎన్‌పీఎస్ ఖాతా తెవరొచ్చు. బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ స్కీమ్ లో చేరడానికి కావాలి.