బ్రేకింగ్: 200 మార్క్ దిశగా మమత…!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. దాదాపుగా మరోసారి ఆమె ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనపడుతుంది. దాదాపుగా 190 స్థానాల్లో మమత లీడింగ్ లో ఉండగా బిజెపి కేవలం 100 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది. ముందు బిజెపి దూకుడు ప్రదర్శించినా సరే ఆ తర్వాత మాత్రం మమత అనూహ్యంగా పుంజుకున్నారు.

వేగంగా మమత ఆధిక్యం పెరిగిపోయింది. గంట గంటకు మమత ఆధిక్యం పెరగడం అలాగే అక్కడ బిజెపి నుంచి పోటీలో ఉన్న ప్రముఖులు కూడా ఓటమి దిశగా వెళ్ళడంతో ఏం జరుగుతుంది అనే ఆసక్తి పెరిగిపోతుంది. వామపక్షాలు అక్కడ ప్రభావం చూపించడం లేదు. కేవలం 5 స్థానాల్లో మాత్రమే వామపక్షాలు ఆధిక్యంలో ఉన్నాయి. దాదాపుగా మమత విజయం సాధించినట్టే. తమిళనాడులో డిఎంకె విజయం దిశగా వెళ్తుంది.