Senior Citizen scheme: సీనియర్ సిటిజన్స్ కోసం సూపర్ స్కీమ్స్…!

-

మీరు ఏ రిస్క్ లేకుండా రాబడి పొందాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండ వీటి కోసం మీరు తెలుసుకోవాలి. వీటిల్లో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కచ్చితమైన రాబడి వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌ (Senior Citizen scheme) కు ఇవి బెస్ట్. ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాల లోకి వెళితే..

 

Senior Citizen scheme
cash

సీనియర్ సిటిజన్స్ కోసం పలు రకాల స్కీమ్స్ అందుబాటులో వున్నాయి. వీటి వలన మంచి లాభం వాళ్లకి కలుగుతుంది. ఇక స్కీమ్స్ ఏమిటి..?, ఎలా పని చేస్తాయి వంటి వివరాలని కూడా చూసేద్దాం.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ SCSS స్కీమ్ సీనియర్ సిటిజన్స్ కోసం వుంది. ఇందులో రూ.15 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీనిపై 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ కాలం అయితే ఐదు ఏళ్ళు.

ఇది ఇలా ఉంటే సీనియర్ సిటిజన్స్ కోసం పోస్టాఫీస్‌లో మంత్లీ ఇన్‌కమ్ POMIS స్కీమ్ కూడా ఉంది. దీనిలో 6.6 శాతం వడ్డీ పొందొచ్చు. గరిష్టంగా జాయింట్ అకౌంట్ మీద రూ.9 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే మీది సింగిల్ అకౌంట్ అయితే రూ.4.5 లక్షలు పెట్టొచ్చు.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ FD స్కీమ్స్‌ ద్వారా కూడా డబ్బులు వస్తాయి. సీనియర్ సిటిజన్స్‌కు అదనపు వడ్డీ వస్తుంది. 5 నుంచి పదేళ్ల కాల పరిమితిలో డబ్బులు ఉంచితే బ్యాంకులు ప్రత్యేక స్కీమ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. 7 శాతానికి పైగా వడ్డీ పొందొచ్చు.

అలానే ప్రధాన్ మంత్రి వయ వందన యోజన PMVVY స్కీమ్ ఉంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ వస్తోంది. రూ.15 లక్షల వరకు డబ్బులు దాచుకోవచ్చు. మెచ్యూరిటీ కాలం పదేళ్లు. ఇది కూడా సీనియర్ సిటిజన్స్ కి లాభదాయకంగా ఉంటుంది.

ఫ్లోటింగ్ రేటు సేవింగ్స్ బాండ్లలో కూడా డబ్బులు పెట్టొచ్చు. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ NSC కన్నా 35 బేసిస్ పాయింట్ల ఎక్కువ వడ్డీ వస్తుంది. ప్రస్తుతం 7.15 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ బాండ్ల టెన్యూర్ 7 ఏళ్లు. వడ్డీ రేటు ఆరు నెలలకు ఒకసారి మారుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news