టాలీవుడ్లో ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్, కృష్ణ, శోబన్ బాబు, కృష్ణం రాజు పరిశ్రమ లో పంచ పాండవులు గా వుండే వారు. వీరి మధ్య సినిమాల విషయంలో పోటీతత్వం బాగా ఉండేది. ఎవరైనా మంచి సినిమా తీస్తే వారిని మించి హిట్ కొట్టాలని ఎప్పుడూ ప్రయత్నం చేసే వారు. ముందు ఈ పోటీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య బాగా ఉండేది. తర్వాత కాలంలో అది ఎన్టీఆర్, కృష్ణ మధ్య కూడా పెరిగింది.
వాస్తవానికి బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చేయాలని,ఎన్టీఆర్ గారు బాగా ఇష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు. చివరకు ఆయన ముఖ్యమంత్రి గా వున్నపుడు ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది.అప్పటికే కృష్ణ కాంగ్రెస్ సానుభూతి పరుడు. ఆయన ఎన్టీఆర్ పాలనను ,ఆయన ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూ కొన్ని చిత్రాలు తీశారు.
ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర ఎన్టీఆర్ తీస్తున్నారని తెలిసి పోటీగా 1989లో కృష్ణ హిందీలో ఒక చిత్రాన్ని తీయాలని కృష్ణ నిర్ణయించుకున్నారు.ఎన్టీఆర్‌కి పోటీగా వచ్చే చిత్రంలో అమితాబ్ హీరోగా నటిస్తేనే దీనికి ధీటుగా ఉంటుందని.. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అమితాబ్‌ని ఒప్పించాడు. ఎన్టీఆర్ కు భయపడకుండా సినిమా తీశారు. అలా ఎన్టీఆర్ విషయం లో పోటాపోటీ గా వుండే వారు. ఇక అల్లూరి సీతారామరాజు ను కూడా ఎన్టీఆర్ వద్దన్నా వినకుండా తీసి సూపర్ హిట్ కొట్టారు.