ఏ దేశాన్ని అయినా నడిపే శక్తి మగువలదే అన్నది స్పష్టం.ఆ విధంగా ధీర వనితల కారణంగా భయానక సందర్భాల్లో కూడా మంచి అనదగ్గ మాటలు,విశ్వాసం పెంచే మాటలు వినిపిస్తూనే ఉంటాయి.చెడు నుంచి మంచి వరకూ సాగే యుద్ధం లో మగువల తెగువ ఆత్మవిశ్వాసం దేశాధ్యక్షుడికే కాదు ఆ వేళ ఆ ప్రాంతాన ఉన్న ప్రతిఒక్కరికీ అవసరం.
ఆ విధంగా తెగువ సాహసం నింపుకున్న మహిళల కారణంగానే బిడ్డలకు రక్షణ దక్కుతుంది.అంతేకాదు వీరోచిత పోరాటంలో సైనికులకు ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది కూడా! ఇప్పుడిదే పరిణామం ఉక్రెయిన్ వాకిట!
బిడ్డల కోసమే తాను అజ్ఞాతంలో ఉన్నానని అంటున్నారు ఉక్రెయిన్ వాకిట ఉక్కు మహిళ.కానీ రష్యా మీడియా మాత్రం ఏవో కొన్ని కథనాలు వండి వారుస్తోంది.ఆ విధంగా ఆమె ఎక్కడున్నారు అన్న సందేహం ఒకటి వెల్లడిచేస్తోంది కూడా! మీడియా సందేహాలకు తెరదించుతూ.. ఆమె మాట్లాడారు.ఆ విధంగా ఆమె ఎక్కడున్నది చెప్పారు.దేశంలో యుద్ధం ఉన్నంత వరకూ ఇలాంటి సందేహాలే నడుస్తూ ఉంటాయి.ఇది ఖాయం.కానీ కుటుంబాలను మట్టుబెట్టి రష్యా సైన్యం ఏం సాధింస్తుందో మాత్రం స్పష్టం చేయడం లేదు.
దేశాన్ని వీడి దాటిపోవడం అన్నది జరగని పని అంటున్నారు ఉక్రెయిన్ దేశ ప్రథమ పౌరురాలు.ఈ మాటే యావత్ ప్రపంచాన్నీ ఆశ్చర్యపరుస్తోంది.యుద్ధంలో ఉంటూ దేశాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయంలో ఉంటూ అనుదినం ఆలోచిస్తున్న తన భర్తకు అండగా ఉండడమే తన ధ్యేయమని తనలోనూ ఉక్రెయిన్ రక్తమే ప్రవహిస్తోందని అంటున్నారు..ఆ దేశ ప్రథమ పౌరురాలు.
ఆమె ఎవరు ఏమా కథ.
రెండు దేశాల యుద్ధంలో గెలుపు ఎవరిది అన్నది అటుంచితే ఈ ఆడవాళ్లు పిల్లలు ఏమయిపోయారు అన్న సందేహాలే పరమ దరిద్రంగా ఉంటాయి.నేను ఎక్కడికీ వెళ్లలేదు.యుద్ధంలో పాల్గొంటున్న భర్తకు అండగా ఉంటూనే పిల్లలను కాపాడుకునేందుకు రహస్యంగా భూ అంతర్భాగం (బంకర్) లో దాగుండి పోయానని అంత మాత్రం చేత తాము దేశాన్ని వీడిపోయామని అనుకోవద్దని గట్టిగానే సమాధానం చెప్పారామె. ఇంతకూ ఎవరామె?
ఒలినా జెలెన్ స్కీ ఈ పేరు పెద్దగా ఎవ్వరికీ నిన్నటి దాకా తెలియదు.ఇప్పుడు ఈమెకు ఆడవాళ్లంతా జోహార్లు పలకాలి.ఆడవాళ్లతో పాటు మగవాళ్లు కూడా ఆమెకు జోహార్లు పలకాలి.ఆమె ఎవ్వరో కాదు ఉక్రెయిన్ దేశా అధ్యక్షుడు జెలెన్ స్కీ భార్య.యుద్ధ వేళల్లో ఆమె ఎక్కడ ఉన్నారు.ఆమె ఏమయి పోయారు లాంటి పనికిమాలిన ప్రశ్నలు వేసుకుంటున్న రష్యా మీడియాకు తనదైన మాటలను సందేశం రూపంలో అందించారు.దీంతో యావత్ ప్రపంచం దృష్టిని ఆమె ఒక్కసారిగా ఆకర్షించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు కూడా రాని పనికిమాలిన సందేహాలు ఆ దేశ మీడియాకు రావడంలో వింతేం లేకపోయినా ఇవన్నీ యుద్ధ వేళలలో కొన్ని కుటుంబాల కలవరపాటుకు కారణం అవుతాయి.కానీ ఆమె మాత్రం ధైర్యం చేసి రష్యా మీడియా అపోహలను తొలగించారు. తాము దేశాన్ని శత్రుమూకల నుంచి రక్షించుకునేందుకే ప్రయత్నిస్తున్నామని,ఈ సమయంలో దేశం దాటి పోవడం అన్నది జరగని పని అని మరో మారు స్పష్టం చేశారామె తన సందేశంలో!