సూపర్ మాన్, స్పైడర్ మాన్ కాదు.. అసలు హీరో ఆయనే.. తేజ సజ్జ..!

-

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హిందూమతం ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారిన చైల్డ్ ఆర్టిస్టు తేజ సజ్జ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత తేజ రెండు మూడు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హనుమాన్ అనే టైటిల్ తో రానుంది.

ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో అంటూ ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా టీజర్ ను విడుదల చేయగా.. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే హీరో తేజ మాట్లాడుతూ..” హనుమాన్ గాలి కంటే వేగంగా ప్రయాణించగలిగిన వారు.. బుద్ధిలో శ్రేష్టులు.. వానర యోధుల్లో ముఖ్యులు.. ఇంద్రియాలనే జయించిన వారు.. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి దూత. ఇంతకంటే సూపర్ హీరో మన దగ్గర ఎవరున్నారు.. సూపర్ హీరో అనగానే స్పైడర్ మాన్ , సూపర్ మాన్ అంటూ భావిస్తుంటారు.. అయితే వాళ్లను సినిమాల్లో మాత్రమే చూసాము. కానీ వాళ్ళు స్ఫూర్తి పొందింది మన కల్చర్ నుండి.. మన హనుమంతుల వారి నుండి .. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్ మాత్రమే.

ఇది మన సత్యం.. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడు అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తారనేదే మా హనుమాన్ చిత్రం. సూపర్ మాన్ , స్పైడర్ మాన్ కాదు.. అసలు హీరో హనుమాన్ అంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తేజ. ఇంత గొప్ప సినిమాలో పాత్రకు న్యాయం చేస్తానని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్ చెప్పడం చిన్న మాటే అవుతుంది.. కానీ ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నాను” అంటూ తేజ తన మనసులో మాటను బయట పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news