సూపర్ స్టార్ కృష్ణ ఉన్నత వ్యక్తిత్వం గల మనిషి – డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

-

సూపర్ స్టార్ కృష్ణ గొప్ప నటుడే కాక.. ఉన్నత వ్యక్తిత్వం గల మనిషి అని కొనియాడారు ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. డేరింగ్ గా సినిమాలు తీసేవారని, నిజజీవితంలోనూ కృష్ణ అలాగే ఉండే వారిని తెలిపారు. ఏలూరు ఎంపీగా పనిచేసినప్పుడు వరద బాధిత రైతులకు కృష్ణ ఎంతో సాయం చేశారన్నారు. చెరుకు రైతులకు సకాలంలో పర్మిట్లు ఇప్పించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు.

నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటి వారినైనా ఎదిరించి నిలబడే మనస్తత్వం గల నిజాయితీపరుడు సూపర్ స్టార్ కృష్ణ అంటూ కొనియాడారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇక సీఎం వైఎస్ జగన్ రేపు హైదరాబాద్ కి రానున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు బుధవారం రోజున ఆయన హైదరాబాద్ కి రానున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news