సుప్రీమ్ కోర్ట్ లో జగన్ కి షాక్ ..!

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం షాకిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా వైరస్ దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదివారం ఒక మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే రోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ని కలిశారు. ఆయన నుంచి స్పందన రాకపోవడంతో సుప్రీం కోర్టు గడప తొక్కింది రాష్ట్రప్రభుత్వం.

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయటం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి వేదికగా మారింది. కావాలనే చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రమేష్ కుమార్ టిడిపిని  కాపాడుకోవడానికి ఎన్నికలను వాయిదా వేశారని, ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిందని దీని వెనుక చంద్రబాబు నాయుడు వ్యూహం ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ నుంచి ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు మంత్రులు పదేపదే కులం ఆధారంగా ఆరోపణలు చేశారు.

కరోనా వ్యాప్తి అంతగా లేదని కాబట్టి రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు నిర్వహించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కి ఒక లేఖ కూడా రాశారు. దీనిపై స్పందించిన రమేష్ కుమార్ తాము అన్ని రాష్ట్రాల కమిషనర్లతో, అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా అడిగి ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news