సుశాంత్ సింగ్ మృతి కేసును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ తండ్రి కేకే సింగ్ అభ్యర్థన మేరకు బీహార్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా.. కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఓకే చెప్పింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగి బీహార్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. అందులో రియా చక్రవర్తిని సీబీఐ ఎ1గా చేర్చింది. అయితే బీహార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న కేసును ముంబైకి ట్రాన్స్ ఫర్ చేయాలని, ఇందులో సీబీఐ జోక్యం అవసరం లేదని కోరుతూ రియా చక్రవర్తి ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
రియా చక్రవర్తి పిటిషన్‌ను సుప్రీం కోర్టు గత వారం నుంచి విచారిస్తోంది. ఈ క్రమంలో ఆమె పిటిషన్‌పై కోర్టు రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు తీర్పునివ్వనుంది. దీంతో సుప్రీం తీర్పు కోసం అటు సీబీఐ, ఇటు రియా ఎదురు చూస్తున్నారు. అయితే ఇందులో రియాకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి సీబీఐకి దేశంలో ఎక్కడికైనా వెళ్లి విచారణ చేసేందుకు అధికారం ఉంటుంది. దాన్ని ఏ ప్రభుత్వం కూడా అడ్డుకోలేదు. ఇక బాధితులు ఇప్పటికే సీబీఐ దర్యాప్తును కోరడం, కేంద్రం అంగీకరించడం, సీబీఐ దర్యాప్తు చేపట్టడం కూడా జరిగిపోయాయి. అంతా అధికారికంగానే జరిగింది. కనుక సుప్రీం ఈ విషయంలో సీబీఐకి సపోర్ట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
సుప్రీం కోర్టు సుశాంత్ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే రియాను సీబీఐ అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సుశాంత్ చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో నిజానికి రోజుకో కొత్త విషయం బయట పడుతోంది. ఇక మొదట్నుంచీ రియా చక్రవర్తి వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగానే ఉంది. గతంలో ఆమె ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని కోరింది. కానీ సీబీఐ కేసు విచారణ చేపట్టగానే ఆమె యూ టర్న్ తీసుకుంది. సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కూడా గత వారం ఈ విషయమై రియాను ప్రశ్నించింది కూడా. అయితే రియాకు రేపు వ్యతిరేకంగానే తీర్పు వస్తుందని, సీబీఐకి ఈ కేసును కోర్టు ట్రాన్స్‌ఫర్ చేస్తుందని కూడా తెలుస్తోంది.