నేడు తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

-

నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్ పై విచారణ జరగనుంది.గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం..చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.

ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి ఉన్నారు. బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమన్న తెలంగాణ ప్రభుత్వం…విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధి లేకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని పేర్కొంది. గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పిటిషన్ లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే పెండింగ్ బిల్లుల ఆమోదం పై గవర్నర్ కార్యదర్శితో చర్చించారు అడిషనల్ సోలిసిటరి జనరల్. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని పిటిషన్ లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news