హిజాబ్‌ బ్యాన్​పై సుప్రీం కీలక నిర్ణయం

-

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధం ఎత్తివేతపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హిజాబ్‌ నిషేధానికి అనుకూలంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం హిజాబ్‌ ధరించడం తప్పనిసరి ధార్మిక విధానం కాదని ఇటీవల కర్ణాటక హైకోర్టు స్పష్టంచేసింది. తరగతి గదుల్లో.. హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని ఉడుపికి చెందిన కొందరు విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును అనేక మంది సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబరు 5కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news