జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

-

జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వారణాసిలోని జ్ఞానవాపి-శ్రీంగార్‌ గౌరి ఆవరణలోని ‘శివలింగం’ రక్షణ చర్యలు కొనసాగించాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ వివాదానికి సంబంధించిన అన్ని వ్యాజ్యాల ఏకీకరణ కోసం వారణాసి జిల్లా న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకొనేందుకు హిందూ కక్షిదారులకు అనుమతించింది. అలాగే సర్వే కమిషనర్‌ నియామకంపై అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ అంజుమన్‌ ఇంతెజామియా మసీద్‌ నిర్వహణ కమిటీ దాఖలు చేసిన అప్పీలుపై మూడు వారాల్లోగా సమాధానమివ్వాలని హిందూ పార్టీలను నిర్దేశించింది.

‘జ్ఞానవాపి’ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 5న చేపట్టనున్నట్లు వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి ఏకే విశ్వేష శుక్రవారం వెల్లడించారు. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మసీదు ఆవరణలో సర్వేకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నెల 2న జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version