విజయ్ మల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వు..!

-

కోర్టు ధిక్కరణ కేసులో తనను దోషిగా పేర్కొంటూ 2017లో ఇచ్చిన తీర్పును మళ్లీ సమీక్షించాలని రుణాల ఎగవేతదారు విజయ్ మల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 4 కోట్ల డాలర్ల సొమ్మును తన వారసులకు బదిలీ చేయడంపై విజయ్ మల్యాను సుప్రీంకోర్టు 2017లో దోషిగా తేల్చింది.

ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ మల్యా వేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం విచారణ చేపట్టింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ అతని కుమారుడు, కుమార్తెలకు 4 కోట్ల డాలర్లను మాల్యా బదిలీ చేశారని ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకు కన్సార్టియం సుప్రీంలో పిటిషన్ వేసింది.ఆ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం విజయ్ మల్యాను కోర్టు ధిక్కరణ కింద దోషిగా తేలుస్తూ 2017 మే లో తీర్పు వెలువరించింది.

పలాయనంలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగిస్తారని వార్తలు వచ్చినా.. అది ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించట్లేదు. బ్రిటన్​ ప్రభుత్వం తాజాగా మరో మెలిక పెట్టింది. చట్టంలో ఉన్న నిబంధనల దృష్ట్యా వాటిని పరిష్కరించాకే.. పంపిస్తామని బ్రిటన్ హై కమిషన్ స్పష్టం చేసింది.
అయితే, ఆ చట్ట సమస్య ఏంటన్నది చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. అది రహస్యమని చెబుతున్న బ్రిటన్ హై కమిషన్.. యూకే లా ప్రకారం ఆ సమస్య పరిష్కరించాకే మాల్యాను దేశం దాటిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో మాల్యాను ఇప్పట్లో భారత్‌కు రప్పించడం సాధ్యమేనా… అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news