సుప్రీమ్ కోర్ట్: 18 ఏళ్ళు కాదు గ్రాడ్యుయేషన్ అయ్యే దాక కొడుకుకి డబ్బులు పంపాలి…!

-

బెంజ్ ఆఫ్ జస్టిస్ డీవై చంద్ర చడ్ మరియు జస్టిస్ ఎంఆర్ షా గురువారం తీర్పుని ఇచ్చారు.హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ కోర్టు వద్దకు వస్తే తన కొడుకుని 18 ఏళ్ల వరకు చదివించడం కాదు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకూ చదివించాలని అన్నారు. గ్రాడ్యుయేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ కింద మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి కాలం లో పిల్లల్ని 18 ఏళ్ల వరకు చదివిస్తే సరిపోదు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకూ తల్లిదండ్రులు చదివించాలని చెప్పింది.

supreme court

హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఆ వర్కర్ కి జూన్ 2005 లో మొదటి భార్య తో విడాకులు అయిపోయాయి. దీంతో కోర్టు తన కొడుకు కి నెలకి 20000 రూపాయలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత తను హైకోర్టుకు వెళ్ళాడు. అక్కడ కూడా రిలీఫ్ రాకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తన చేతికి కేవలం రూ. 21 వేలు మాత్రమే వస్తాయి. అందులో నుండి తన కొడుకుకి రూ. 20,000 ఇస్తే ఇంక తనకి ఏం మిగులుతుంది అని ప్రశ్నించాడు.

పైగా అతనికి రెండో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకవేళ మొదటి భార్య కొడుకుకే రూ.20,000 ఇచ్చేస్తే వీళ్ళని ఎలా పోషిస్తాడు అని అడగడం జరిగింది. ఆ ఎంప్లాయి తరుపున వాదించే లాయరు మొదటి భార్య కి ఇతనికి విడాకులు ఇవ్వడానికి కారణం తన భార్యకి మరొకరి తో అక్రమ సంబంధం ఉండడం వల్లే అని చెప్పారు. అయితే మీరు తన కొడుకుని బ్లేమ్ చేయకూడదు అని బెంచ్ చెప్పడం జరిగింది.

పైగా బెంచ్ రెండో పెళ్లి చేసుకునేటప్పుడు మొదటి భార్య కొడుకుని కూడా మీరు చూసుకోవాలి అని మీకు తెలియాలి కదా అని అంది. అడ్వకేట్ గౌరవ్ అగర్వాల్ రూపాయలు 10000 ప్రతి నెల ఇవ్వమని చెప్పారు. మెయింటినెన్స్ కింద తక్కువ డబ్బులు ఇచ్చిన సరే అని మొదటి భార్య తరఫున లాయర్ అన్నారు. అయితే ఆ కొడుకు బ్యాచిలర్ డిగ్రీ పొందే వరకు ఈ డబ్బులు ఇవ్వాల్సి ఉంది అని చెప్పారు. మార్చి 2021 నుంచి ప్రతి నెల రూపాయలు 10 వేలు ఇవ్వాలని కోర్టు చెప్పింది. పైగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒక రూపాయి ఎక్కువ చేసి ఇవ్వాలని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news