షణ్ముఖ్ కి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పోలీసులు !

-

మొన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌రు 10లో యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ న‌డుపుతున్న కారు అదుపుత‌ప్పి మ‌రో రెండు కార్లు, రెండు బైక్‌ల‌ను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు కూడా. దీంతో షణ్ముఖ్‌ జశ్వంత్‌ కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా 170 రీడింగ్ వచ్చింది.

దీంతో ఐపీసీ సెక్షన్ 337, 279 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడికి డ్రంక్ డ్రైవ్‌కు సంబంధించిన కేసు మాత్రమే కాకుండా.. యాక్సిడెంట్‌కు సంబంధించిన కేసు కూడా నమోదు చేశారు. కాగా షణ్ముఖ్‌కు త్వరలో పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించదానికీ పోలీసులు నోటీసులు ఇఒచ్చారు.  అయితే ఆ నోటీసులు ప్రకారం ఆయన కౌన్సిలింగ్ కి హాజరు కాలేదని అంటున్నారు. దీంతో పోలీసులు కోర్టు ప్రొసీడింగ్స్ కి సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news